తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విపక్ష నేతల కశ్మీర్​ పర్యటనకు సర్కారు బ్రేక్​ - గాంధీ

ప్రతిపక్ష నేతలు జమ్ముకశ్మీర్‌లో నేడు పర్యటిస్తామని ప్రకటించగా.. రాష్ట్ర ప్రభుత్వం వారిని రావొద్దని కోరింది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో పాటు సీనియర్‌ నేతలు గులాంనబీ ఆజాద్‌, ఆనంద్‌శర్మ సహా సీపీఐ, సీపీఎం నేతల బృందం కశ్మీర్​కు వెళ్లేందుకు సమాయత్తమైంది.

జమ్ముకశ్మీర్​కు విపక్ష నేతలు.. రావొద్దన్న సర్కారు

By

Published : Aug 24, 2019, 5:05 AM IST

Updated : Sep 28, 2019, 1:49 AM IST

కశ్మీర్​కు విపక్షనేతలను రావొద్దన్న సర్కారు

జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులను పరిశీలించేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా ప్రతిపక్ష నేతలు శ్రీనగర్‌ వెళ్లేందుకు సమాయత్తంకాగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎవరూ రావొద్దని కోరింది. క్రమంగా పరిస్థితులు కుదుటపడుతున్న తరుణంలో రాజకీయ పార్టీల నాయకుల పర్యటనలు లోయలో శాంతికి విఘాతం కలిగిస్తాయని జమ్ముకశ్మీర్‌ సర్కారు ఒక ప్రకటన విడుదల చేసింది.

నేతలు పర్యటిస్తే వేర్వేరు ప్రాంతాల్లో విధించిన ఆంక్షలను ఉల్లఘించినట్లు అవుతుందని పేర్కొంది. లోయలో శాంతి నెలకొనడమే ప్రధమ ప్రాధాన్యమనే విషయాన్ని అర్థం చేసుకుని రాజకీయ నాయకులు తమకు సహకరించాలని ప్రభుత్వం కోరింది. రాహుల్ గాంధీ, గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, సీపీఐ ప్రధాన కార్యదర్శి రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, ఆర్జేడీ ప్రతినిధి మనోజ్ ఝాతో కూడిన బృందం నేడు కశ్మీర్‌లో పర్యటించేందుకు సిద్ధంకాగా ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది.

ఇదీ చూడండి: ఈటీవీ భారత్​ కథనానికి స్పందన- ఎస్సీలకు న్యాయం

Last Updated : Sep 28, 2019, 1:49 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details