యూరోపియన్ సమాఖ్య ఎంపీల బృందం పర్యటన ద్వారా కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసే ఉద్దేశం ఎంత మాత్రం లేదని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇలాంటి బృందాలు అధికారిక మార్గాల ద్వారా రావాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈయూ ఎంపీల బృందం కశ్మీర్ సందర్శనపై మొదటిసారి స్పందించిన విదేశాంగశాఖ ఇలాంటి పర్యటనలకు విస్తృత జాతీయ ప్రయోజనాలే ముఖ్యమని తేల్చిచెప్పింది.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఈయూ ఎంపీల రెండు రోజుల పర్యటనలో భాగంగా.. కశ్మీర్‌లో తాజా పరిస్థితిని పరిశీలించిన్నట్లు అధికారులు తెలిపారు.