తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వాడిన మాస్కులను రీసేల్​ చేసే యత్నంలో మళ్లీ..?

కొవిడ్​ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం.. మాస్కులు తప్పనిసరి చేసిన నేపథ్యంలో మహారాష్ట్రలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు. వాడిపారేసిన మాస్కులను ఉతికి మరలా అమ్మేందుకు యత్నిస్తున్నారు. ఈ కేసులో గతవారమే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్​ చేయగా.. తాజాగా వారి వద్ద నుంచే మరో రూ. 71.86 లక్షల విలువైన మాస్కులను స్వాధీనం చేసుకున్నారు.

Rs 71 lakh seized in Maharastra
వాడిన మాస్కులను రీసేల్​ చేసే యత్నంలో మళ్లీ..?

By

Published : Apr 20, 2020, 7:37 AM IST

కరోనా సోకకుండా జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని కేంద్రం సూచించింది. దీన్ని ఆసరాగా చేసుకున్న మహారాష్ట్రలోని ముగ్గురు వ్యక్తులు.. వాడిపారేసిన మాస్కులను, యథేచ్చగా విక్రయిస్తున్నారు. ఈ కేసులో గతవారమే వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా.. తాజాగా మరోసారి వారి నుంచి సుమారు 36 వేల మంది వినియోగించిన మాస్కులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.71.86 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఆ ముగ్గురే.!

వాడిపారేసిన మాస్కులను ఉతికి, ఇస్త్రీచేసి బాక్సుల్లో ప్యాక్​చేసి మళ్లీ అమ్మకానికి పంపుతున్నారనే ఆరోపణలతో ముగ్గురిని ఈ నెల 13న అరెస్టు చేశారు పోలీసులు. నాగరాజ్‌ పిళ్లై, రోహిత్ కొఠారి, మహమ్మద్‌ ఆలమ్​ అనే ఈ ముగ్గురి నుంచి.. రూ. 71 లక్షల విలువ చేసే మాస్కులను విరార్‌ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.

అయితే.. ఈ ముగ్గురే అదే ప్రాంతంలో సుమారు 25వేల మంది ఉపయోగించిన రూ. 51.34 విలువగల మాస్కులు పునర్​ విక్రయానికి పంపిస్తూ అడ్డంగా దొరికిపోయారు.

ఇదీ చదవండి:వాడేసిన మాస్కులను ఉతికి, రీసేల్​కు యత్నం

ABOUT THE AUTHOR

...view details