చైనాలో శనివారం కరోనా కేసులు తొలిసారి సున్నాకు పడిపోయాయి. లాటిన్ అమెరికాలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఆసుత్రులన్నీ వైరస్ బాధితులతో నిండిపోతున్నాయి. బ్రెజిల్, మెక్సికో దేశాల్లో ఈ వారంలో ఎక్కువ కేసులు, మరణాలు సంభవించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు జర్మనీలో తిరిగి ప్రారంభించిన చర్చి, రెస్టారెంట్లపై కొవిడ్ ప్రభావం చూపింది. ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఏడుగురికి మహమ్మారి సోకింది. కొద్దిరోజుల్లో రంజాన్ మాసం ముగియనున్న నేపథ్యంలో.. టర్కీ ప్రభుత్వం కట్టుదిట్టమై లాక్డౌన్ ఆంక్షలను విధించింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మందికిపైగా మహమ్మారికి బలయ్యారు. 53 లక్షల 26,230 మందికి కరోనా సోకింది.
పాక్‌లో 50వేలకుపైగా..
పాకిస్థాన్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,743 మంది కొవిడ్ బారిన పడ్డారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 52,437 కేసులు నమోదయ్యాయి. మరో 24 మంది మరణించగా.. దేశంలో వైరస్ మృతుల సంఖ్య 1,101కి చేరింది.