తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సిక్స్​ప్యాక్ బాలిక ఒలింపిక్స్'​​ ఆశయానికి కోహ్లీ ఫిదా​! - sixpack kid in jodhpur

ఆమె 12 నిమిషాల్లో 3 కిలోమీటర్లు అవలీలగా పరుగెత్తగలదు. 8 ఏళ్లకే సిక్స్​ప్యాక్​తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2024 ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించి తీరుతానని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది. అందుకే టీమిండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ కూడా ఈ రాజస్థానీ​ లిటిల్​ ఛాంపియన్​కు ఫిదా అయ్యాడు​.

Virat is also a fan of 8-year-old 'Pooja' OF JODHPUR  RAJASTHAN dreams of winning medals in Olympics
'సిక్స్​ప్యాక్ బాలిక ఒలింపిక్స్'​​ ఆశయానికి కోహ్లీ ఫిదా​!

By

Published : Dec 21, 2019, 8:02 AM IST

'సిక్స్​ప్యాక్ బాలిక ఒలింపిక్స్'​​ ఆశయానికి కోహ్లీ ఫిదా​!

రాజస్థాన్​ జోధ్​పుర్​కు చెందిన ఎనిమిదేళ్ల పూజ.. ఒలింపిక్స్​ కోసం గత ఐదేళ్లుగా కఠోర సాధన చేస్తూ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్​ కోహ్లీనే మెప్పించేసింది.

ఆమె లక్ష్యం ఒలింపిక్స్​..

పూజ చదివేది మూడో తరగతే అయినా..​ సిక్స్​ప్యాక్​ శరీరాకృతితో మహా మహా కండల వీరులనే ఆశ్చర్యపరుస్తోంది. మూడేళ్ల వయసు నుంచే శిక్షణ తీసుకుంటోంది. ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధించాలన్న ఆశయంతోనే తన బాల్యాన్ని సాధనకే అంకితం చేసింది. ఇప్పుడు పరుగు పందెం సహా పలు క్రీడల్లో ఆరితేరిపోయింది.

పూజ కష్టం, దేశం కోసం గెలవాలన్న తపనను చూసి విరాట్​ కోహ్లీ ఫౌండేషన్​ సాయం చేసేందుకు ముందుకువచ్చింది. తన శిక్షణకు కావాల్సిన అన్ని ఖర్చులు భరిస్తూ స్కాలర్​షిప్ ప్రకటించింది.

"అక్టోబర్​ నెలలో విరాట్​ కోహ్లీని కలిశాను. ఇలాగే కృషి చేస్తూ.. దేశం కోసం బంగారు పతకాన్ని గెలవాలని ఆయన చెప్పారు. నేను 2024 ఒలింపిక్స్​లో స్వర్ణ పతకం సాధిస్తాను. నేను ఇప్పుడు మూడో తరగతి చదువుతున్నా. ప్రతి రోజూ ఉదయం 3 గంటల నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు సాధన చేస్తాను. రన్నింగ్​, వ్యాయామం​, ఫుట్​బాల్​తో పాటు క్రికెట్​లో​ ఫాస్ట్​ బౌలింగ్​ కూడా చేస్తాను. సిక్స్​ప్యాక్​ చేయాలని నేనెప్పుడూ అనుకోలేదు. మా మామయ్య చెప్పినట్టు నేను వ్యాయామం చేశాను అంతే.. సిక్స్​ ప్యాక్​ వచ్చేసింది."
-పూజ

పూజ ఇప్పుడు 12 నిమిషాల్లో 3 కి.మీ. పరుగు తీస్తుంది. మరో నాలుగేళ్లలో కఠోర సాధన చేయించి 9 నిమిషాల్లో 3 కిలోమీటర్లు పరిగెత్తేలా తీర్చిదిద్ది ఒలింపిక్స్​కు పంపిస్తానంటున్నాడు పూజ మామయ్య.

"ఒలింపిక్స్​లో సర్ణం సాధించాలన్న నా కలను నెరవేర్చుకోలేకపోయాను. కానీ, పూజలో ఆ నైపుణ్యం ఉంది. పట్టుదల ఉంది. తను సాధన ప్రారంభించి ఐదేళ్లయింది. తన స్థాయికి సరిపడా బాలలు భారతదేశంలోనే లేరు."

-పూజ మామయ్య

పూజకు పోషకాహారం, టోర్నమెంట్స్​ ఆడేందుకు వెళ్తే అక్కడి ఖర్చులను విరాట్​ కోహ్లీ ఫౌండేషనే భరించనుంది.

ఇదీ చదవండి:ఉన్నావ్​ కేసు: బతికున్నంత కాలం జైల్లోనే సెంగార్​

ABOUT THE AUTHOR

...view details