ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో విష జ్వరాలకు ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా జిల్లాలోని ఫతేహాబాద్ తాలుకాకు చెందిన ఇధౌన్ గ్రామంలో.. విష జ్వరాలకు గత మూడు రోజుల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉంది. జ్వరంతో పాటు దగ్గు, జలుబు, మలేరియాతోనూ ప్రజలు సతమతమవుతున్నారు.
ఈ పరిస్థితులు ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మంగళవారం రాత్రి గ్రామానికి చేరుకున్న వైద్య బృందం రోగులకు చికిత్స అందిస్తోంది. అక్కడే శిబిరాలు ఏర్పాటు చేసుకుంది వైద్య బృందం.