తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' ఆందోళనల వెనక కుట్రకోణం- ట్రంప్ రాకే కారణం! - Situation in Delhi under fully control: Home Secy Ajay Bhalla

దిల్లీలో పౌరచట్ట వ్యతిరేక ఆందోళనల వెనక కుట్రకోణం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజులపాటు భారత్​లో పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే ఈశాన్య దిల్లీలో ఆందోళనలు చెలరేగాయని తెలుస్తోంది. అయితే ఈ పౌర ఆందోళనల్లో పోలీస్ కానిస్టేబుల్, మరో పౌరుడు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. మరో పోలీస్ ఉన్నతాధికారికి గాయాలయ్యాయి. ఆందోళనకారులు రెండిళ్లకు నిప్పుపెట్టారు.

caa
'పౌర' ఆందోళనల వెనక కుట్రకోణం- ట్రంప్ రాకే కారణం!

By

Published : Feb 24, 2020, 8:32 PM IST

Updated : Mar 2, 2020, 11:00 AM IST

దిల్లీలోని పలుచోట్ల జరుగుతున్న సీఏఏ ఆందోళనల వెనక కుట్రకోణం దాగుందా? అంటే అవుననే అంటున్నాయి పలు విశ్వసనీయ వర్గాలు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే నిరసనలు ఉద్ధృతం చేశారని సమాచారం. నేడు చెలరేగిన ఘర్షణల్లో ఓ పౌరుడు, పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందారు. మరో ఉన్నతాధికారికి గాయాలయ్యాయి. అల్లర్లను అణచేందుకు భారీగా బలగాలను మోహరించారు.

అయితే దిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా.

"దిల్లీలో పరిస్థితులు పూర్తిగా అదుపులోనే ఉన్నాయి. పోలీసు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు. ఘటనా స్థలంలో సరిపడ బలగాలు ఉన్నాయి."

-అజయ్ భల్లా, కేంద్ర హోం శాఖ కార్యదర్శి

ఈశాన్య దిల్లీ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు దిల్లీ పోలీస్ కమిషనర్ అమూల్య పట్నాయక్ తెలిపారు.

ఇదీ జరిగింది..

ఈశాన్య దిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్​పుర్, బాబర్​పుర్​లలో రెండురోజులుగా పౌరవ్యతిరేక ఆందోళనలు చెలరేగుతున్నాయి. సీఏఏ అనుకూల వర్గాలు, వ్యతిరేకుల మధ్య ఘర్షణలు జరిగాయి. నేడు ఆందోళనకారులు రెండిళ్లకు నిప్పు పెట్టారు. జాఫ్రాబాద్, మౌజ్​పుర్, బాబర్​పుర్ మెట్రో స్టేషన్లను మూసేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. ఆందోళనకారులు చేసిన రాళ్లదాడిలో రతన్​లాల్ అనే కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పౌరుడు మృతి చెందాడు. డీసీపీ అమిత్​శర్మకు గాయాలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆందోళనకారులు సంయమనం వహించాలని, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్, హోంమంత్రి అమిత్​షా జోక్యం చేసుకోవాలని కోరారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు.

ఇదీ చూడండి:'నమస్తే ట్రంప్'​ నినాదాలతో మారుమోగిన మోటేరా స్టేడియం

Last Updated : Mar 2, 2020, 11:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details