అమెరికా అధ్యక్షుడి పర్యటన వేళ దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌర నిరసనల్లో చెలరేగిన హింస మరింత తీవ్రమైంది. సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణల్లో ఇప్పటివరకు ఏడుగురు మృతిచెందారు. మరో 100 మందికిపైగా గాయపడ్డారు. మృతుల్లో ఒకరు పోలీసు.
ఈశాన్య దిల్లీలో...
ఈశాన్య దిల్లీలోని మౌజ్పుర్లో ఆదివారం అల్లర్లు ప్రారంభమయ్యాయి. సోమవారం జఫ్రాబాద్, మౌజ్‌పుర్, చాంద్‌బాగ్, భజన్‌పురాలో హింస చెలరేగింది.
నిరసనకారులు ఓ అగ్నిమాపక శకటానికి నిప్పు పెట్టారు.
మౌజ్‌పుర్-బ్రహమ్పురి ప్రాంతాల్లో ఈ రోజు ఉదయం కూడా ఆందోళనకారులు రాళ్లురువ్వారు. బ్రహమ్పురిలో దిల్లీ పోలీసులు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎప్) సిబ్బంది కవాతు నిర్వహించారు. రెండు ఖాళీ బులెట్ గుండ్లను స్వాధీనం చేసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నా... ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.