తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి! - dog groom

ఆ పెళ్లి... హిందూ ధర్మం ప్రకారం వైభవంగా జరిగింది. 500 మంది అతిథులు హాజరయ్యారు. రిసెప్షన్ పార్టీ గ్రాండ్​గా జరిగింది. ఇందులో కొత్తేముంది... అందరూ చేసుకునేదేగా అని అనుకోకండి. ఇంత ఘనంగా వివాహ మహోత్సవం జరిగింది కుక్కల జంటకు.

శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!

By

Published : Aug 30, 2019, 4:24 PM IST

Updated : Sep 28, 2019, 9:08 PM IST

శునకాల పెళ్లికి ఊళ్లో పెద్దల హడావుడి!
ఉత్తర్​ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​ మహ్లూనీ గ్రామంలో రెండు శునకాలకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.

శునకాలు వధూవరులాయెనే..

వధూవరులిద్దరూ హిందూ సంప్రదాయ దుస్తుల్లో సుందరంగా ముస్తాబయ్యారు. వరుడు శునకం బ్యాండు మేళాలతో ఊరేగింపుగా వధువు శునకం దగ్గరకు దర్జాగా వెళ్లాడు. పెళ్లి కుమార్తె మెడలో పూల దండ వేసి, తలలో సింధూరం పెట్టి తన భార్యను చేసుకున్నాడు. అలా ఇద్దరూ ఒక్కటయ్యారు.

అప్పగింతల కార్యక్రమం అందరినీ కంటతడి పెట్టించింది. కానీ, మరుసటి రోజు రిసెప్షన్ మాత్రం కళ్లు చెదిరే రేంజ్​లో జరిగింది.

చేసిందంతా వీరే..

మహున్లీ గ్రామంలో జరిగిన కుక్కల పెళ్లికి గ్రామస్థులే పెద్దలయ్యారు. దాదాపు ఐదు వందల మంది ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వివాహాన్ని ఇంత ఘనంగా నిర్వహించడం కోసం గ్రామస్థులంతా విరాళాలు ఇచ్చారు.

ఇంత ఘనంగా శునాకాలకు పెళ్లి ఎందుకు జరిపించారో ఇంకా తెలియలేదుగానీ.. ఈ వేడుక ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది.

ఇదీ చూడండి:చెట్లకు ఉన్న మేకులు లాగడమే ఆయన పని!

Last Updated : Sep 28, 2019, 9:08 PM IST

ABOUT THE AUTHOR

...view details