తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఒక్క ఇల్లు కనిపించకుండా నీటమునిగిన ఊరు - Ground report from bettiah

బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లాలో ఓ ఊరంతా వరదనీటిలో మునిగిపోయింది. గండక్ నది ప్రవాహం ఇళ్లపై నుంచి ప్రవహిస్తున్న నేపథ్యంలో గ్రామం ఉన్న ప్రాంతమంతా ఓ దీవిలా కనిపిస్తోంది. ప్రాణాలు రక్షించుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్న గ్రామస్థులు.. తమ పంటలు నాశనమయ్యాయని, తీవ్రనష్టం వాటిల్లిందని వాపోయారు.

bihar
ఒక్క ఆవాసం కనిపించకుండా నీటమునిగిన ఊరు

By

Published : Jul 25, 2020, 5:16 PM IST

బిహార్ పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా వద్ద గండక్​ నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో.. ఓ ఊరంతా నీటమునిగింది. మజౌలియా ప్రాంతానికి చెందిన రాం​పూర్వా మహన్వా గ్రామం పూర్తిస్థాయిలో జలమయమైంది. ఊరు విస్తరించి ఉన్న ప్రాంతమంతా వరదనీరే కనిపిస్తూ.. ద్వీపాన్ని తలపిస్తోంది.

తమ నివాసాలు నీటమునిగి, పంటలు నాశనమవడం వల్ల జీవనాధారం కోల్పోయామని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు ఏ అధికారి తమ ఊరిని సందర్శించలేదని స్థానికులు వాపోతున్నారు.

నీటమునిగిన గ్రామం

"ప్రస్తుతం మనం మజౌలియా ప్రాంతం రాంపూర్వా మహన్వా గ్రామంలో ఉన్నాం. ఇదంతా గ్రామమే. కానీ పూర్తిగా నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది. ఇది గండక్ నది నుంచి వచ్చిన నీరు. పంటలు నీటమునిగాయి. గ్రామం విస్తరించిన ప్రాంతమంతా మునిగిపోయింది. ఊరు ఉన్న ఆనవాళ్లు ఎక్కడా కనిపించడం లేదు."

-ఈటీవీ భారత్ ప్రతినిధి

గ్రామస్థులతో మాట్లాడిన అనంతరం ఊరు నీటమునిగిన విషయం వెలుగులోకి వచ్చింది. తమ ఇళ్లన్నీ జలమయమైన నేపథ్యంలో ప్రజలు భయాందోళనలో ఉన్నారు.

ఇదీ చూడండి:దక్షిణ భారతంలో ఐసిస్​ ఉగ్రవాదుల అలికిడి

ABOUT THE AUTHOR

...view details