చంద్రయాన్-2 ప్రయోగంలో మరో కీలక ఘట్టం పూర్తయింది. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్‌ను వేరుచేసే ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ట్వీట్ చేసింది.
చంద్రయాన్ 2: ఆర్బిటర్ నుంచి విడిపోయిన 'విక్రమ్' - Orbit
చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్‌ను వేరు చేసే ప్రయోగం విజయవంతమైంది. మధ్యాహ్నం 1.15 గంటలకు ఈ కీలక ఘట్టం పూర్తయినట్లు ఇస్రో తెలిపింది.

చంద్రయాన్ 2: ఆర్టిటర్ నుంచి విడిపోయిన 'విక్రమ్'
చంద్రయాన్-2 ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్‌ను వేరుచేసే ప్రక్రియ ఈరోజు మధ్యాహ్నం 1.15గంటలకు పూర్తయింది. దీని తర్వాత చంద్రుడి దక్షిణ ధ్రువంలో దిగేందుకు వీలుగా ల్యాండర్ విక్రమ్‌కు రెండు డీ ఆర్బిట్ విన్యాసాలు చేపడతారు.సెప్టెంబరు 3న మొదటి విన్యాసం ఉదయం 9 నుంచి 10గంటల మధ్య చేయనున్నారు. 4న రెండో డీ ఆర్బిట్ విన్యాసం చేపట్టనున్నట్లు ఇస్రో ప్రణాళిక వేసింది. సెప్టెంబరు 7న తెల్లవారుజామున 1.30 నుంచి 2.30 గంటల మధ్యలో విక్రమ్.. చంద్రుడి ఉపరితలంపై దిగనున్నట్లు ఇస్రో ఇదివరకే ప్రకటించింది.
Last Updated : Sep 29, 2019, 4:15 AM IST