తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దూబే డెన్​పై​ దాడి సమాచారం పోలీసుల నుంచే లీక్ - daya shankar

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో 8 మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీషీటర్ వికాస్ దూబే వ్యక్తిగత సహాయకుడు దయాశంకర్ అగ్నిహోత్రిని అరెస్టు చేశారు పోలీసులు. విచారణలో దూబే ఇంటిపై దాడి సమాచారం ముందే అందిందని చెప్పాడు. ఈ నేపథ్యంలో ఎదురుదాడికి ముందుగానే సన్నద్ధమయినట్లు వెల్లడించాడు.

dubey
దూబే డెన్​పై​ దాడిలో పోలీస్ స్టేషన్​ నుంచే సమాచారం

By

Published : Jul 5, 2020, 2:15 PM IST

Updated : Jul 5, 2020, 2:45 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఎనిమిది మంది పోలీసుల మృతికి కారణమైన రౌడీషీటర్​ వికాస్ దూబేకు తనను అరెస్ట్ చేసేందుకు వస్తున్నారని ముందే సమాచారం వెళ్లినట్లు చెప్పాడు అతని సహాయకుడు దయాశంకర్ అగ్నిహోత్రి. శనివారం పోలీసులకు చిక్కిన అగ్నిహోత్రి.. జులై 3 ఎన్​కౌంటర్​పై పోలీస్ స్టేషన్​ నుంచే సమాచారం అందినట్లు వెల్లడించాడు. దాడి విషయం తెలిసిన వెంటనే 25 నుంచి 30 మందిని పిలిచి పోలీసులను ఎదుర్కొనేందుకు దూబే సన్నద్ధమయినట్లు తెలిపాడు.

దూబే కాల్పులు..

జులై 3న కాల్పులు జరిగే సమయంలో దూబే అక్కడే ఉన్నాడని వెల్లడించాడు అగ్నిహోత్రి. పోలీసులపై స్వయంగా కాల్పులు జరిపాడని చెప్పాడు. ఘటనా సమయంలో తాను ఓ గదిలో దాక్కున్నానని.. అందువల్ల ఎన్​కౌంటర్ సందర్భంగా ఏం జరిగిందనేది తెలియదని పోలీసులకు వివరించాడు. శనివారం రాత్రి పోలీసులు, దూబే అనుచరుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల అనంతరం అగ్నిహోత్రిని అరెస్టు చేశారు పోలీసులు.

దూబే సహాయకుడు అగ్నిహోత్రి

ఇదీ చూడండి:దూబే కోసం పోలీసుల వేట- రౌడీషీటర్ ఇల్లు కూల్చివేత

రౌడీషీటర్ల దాడిలో 8 మంది పోలీసులు మృతి

Last Updated : Jul 5, 2020, 2:45 PM IST

ABOUT THE AUTHOR

...view details