తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛాతీలోకి ఇనుప కడ్డీ దూసుకెళ్లినా.. బతికిపోయాడు! - -ఛాతీలోకి ఇనుప కడ్డీ దూసుకెళ్లినా.. బతికిపోయాడు!

ఛాతీలోకి ఇనుప కడ్డీ దూసుకుపోయినా.. బతికి బయటపడ్డాడు ఓ లారీ డ్రైవర్​. కర్ణాటకలో జరిగిన ఓ ఘోర ప్రమాదంలో దారుణంగా గాయపడిన చోదకుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాడు. తెలుగు రాష్ట్రానికి చెందిన ఆ లారీ డ్రైవర్​ ప్రాణాలను కర్ణాటక రిమ్స్​ వైద్యులు కాపాడారు.

vijayawada man escaped from danger after an iron rod went off his chest in raichur karnataka
ఛాతీలోకి ఇనుప కడ్డీ దూసుకెళ్లినా.. బతికిపోయాడు!

By

Published : Dec 16, 2019, 6:10 PM IST

Updated : Dec 16, 2019, 11:12 PM IST

ఛాతీలోకి ఇనుప కడ్డీ దూసుకెళ్లినా.. బతికిపోయాడు!

కర్ణాటక రాయ్​చూర్​లో.. ఆంధ్రప్రదేశ్​కు చెందిన ఓ లారీ డ్రైవర్​ ఛాతీలోకి ఇనుపకడ్డీ దూసుకెళ్లింది. అయితే.. వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.

ఇదీ జరిగింది..

గురమితక్కల్​ ప్రాంతానికి సమీపంలో బస్సు వెనుక భాగాన్ని ఓ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో విజయవాడకు చెందిన కోటేశ్వర్​రావు అనే లారీ డ్రైవర్​ ఛాతీలోకి ఓ ఇనుప కడ్డీ దూసుకుపోయింది. స్థానికులు అతడిని రిమ్స్ ఆసుపత్రిలో చేర్చగా.. వైద్యులు శస్త్ర చికిత్స చేసి ఆ కడ్డీని బయటకు తీశారు.

గునపంలాంటి ఇనుప కడ్డీ కోటేశ్వర్​ రావు శరీరంలోకి దూసుకుపోయినా.. వైద్యులు విజయవంతంగా అతడి ప్రాణాలు కాపాడారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో కోటేశ్వర్​రావు సురక్షితంగా ఉన్నాడు.

ఇదీ చదవండి:ఉన్నావ్​ కేసులో దోషి కుల్​దీప్​ సెంగారే: కోర్టు తీర్పు

Last Updated : Dec 16, 2019, 11:12 PM IST

ABOUT THE AUTHOR

...view details