వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు ఎంత ఉండాలన్న దానిపై భారత గణాంక సంస్థ(ఐఎస్‌ఐ) శుక్రవారం ఎన్నికల సంఘానికి నివేదికను అందజేసింది. దీనిని పరిశీలించిన అనంతరం ఈసీ అంతిమ నిర్ణయం తీసుకోనుంది. ఈ నివేదికను ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలకు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
ప్రతి నియోజకవర్గంలో 10 నుంచి 50 శాతం వీవీప్యాట్ స్లిప్పులను ఈవీఎంలతో పాటు పోల్చి చూడాలని గతంలో వివిధ రాజకీయ పక్షాలు డిమాండ్ చేశాయి. దీనితో నమూనా పరిమాణంపై నివేదికను ఇవ్వాలని అప్పటి ఈసీ ఛైర్మన్ ఓపీ రావత్ ఐఎస్‌ఐని కోరారు.