భూమి మీదనున్న వేలాది అద్భుత ప్రకృతి దృశ్యాలను... అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటాయో 'గూగుల్ ఎర్త్ వ్యూ' కంప్యూటర్ ప్రోగ్రామ్ ద్వారా ఆ విధంగా చూడవచ్చు. అయితే ఈ సెర్చింజన్ దిగ్గజం ఇటీవలే తన సంకలనానికి మరో వెయ్యి కొత్త చిత్రాలను జతచేసింది. దీంతో 'బర్డ్-ఐ వ్యూ' ద్వారా ఏడు ఖండాల్లో.. మనం చూడగలిగే అద్భుత దృశ్యాల సంఖ్య 2,500 కి చేరింది.
35 భారత్ దృశ్యాలు...
గూగుల్ ఎర్త్ వ్యూలో మన దేశానికి చెందిన 35 ప్రాంతాల వివరాలు కూడా చోటు దక్కించుకున్నాయి. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంతో సహా గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలోని వివిధ ప్రదేశాలు హైరిజల్యూషన్ శాటిలైట్ చిత్రాల రూపంలో దర్శనమివ్వనున్నాయి.