గుజరాత్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలు ఉక్కు మనిషి సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం సందర్శకులకు ఆటంకం కలిగిస్తున్నాయి. నర్మదానది తీరంలోని 182 మీటర్ల ఈ విగ్రహంలో పర్యటకుల సందర్శన కోసం ఏర్పాటు చేసిన వీడియో గ్యాలరీలో వర్షపునీరు చేరింది. ఫలితంగా చట్టుపక్కలున్న ప్రకృతి సోయగాలతో పాటు సర్దార్ సరోవర్ జలాశయం అందాలను చూడాలని ఎంతో ఆసక్తిగా అక్కడికి చేరుకున్నవారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఐక్యతా విగ్రహానికీ తప్పని ముంపు బెడద! - Gujrat
గుజరాత్లో కురుస్తోన్న భారీ వర్షాలతో సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహ సందర్శకులకు పాట్లు తప్పలేదు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో గ్యాలరీలోకి వర్షపు నీరు చేరడం వల్ల పర్యటకులు ఇబ్బంది పడ్డారు.
'ఐక్యతా' విగ్రహానికి తప్పని వర్షపు బెడద..!
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఈ ప్రతిమను గతేడాది అక్టోబర్ 31న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.