తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు వియత్నాం కీలక భాగస్వామి: మోదీ - india Vietnam news

వియత్నాం ప్రధాని నుగుయెన్ జువాన్​తో వర్చువల్​గా సమావేశమయ్యారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల మధ్య భాగస్వామ్యం చాలా కీలకమన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమవుతున్నట్లు పేర్కొన్నారు.

Vietnam important partner in India's Indo-Pacific vision: PM Modi
భారత్​కు వియత్నాం కీలక భాగస్వామి: మోదీ

By

Published : Dec 21, 2020, 7:30 PM IST

భారత్​కు వియత్నాం అత్యంత కీలక భాగస్వామి అని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇండో-పసిఫిక్​ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి రెండు దేశాల మధ్య దృఢమైన భాగస్వామ్యం అత్యంత ముఖ్యమన్నారు. వియత్నాం ప్రధాని నుగుయెన్​ జువాన్​తో వర్చువల్​గా భేటీ అయ్యారు మోదీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగైనట్లు చెప్పారు.

భారత సులభ విధానంలో వియత్నాం మూల స్తంభమని మోదీ అన్నారు. ఆ దేశంతో సుదీర్ఘ, వ్యూహాత్మక బంధాలు కొనసాగించాలని భారత్​ భావిస్తోందన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని కాపాడటమే రెండు దేశాల ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు. వియత్నాం ప్రభుత్వం కరోనాను కట్టడి చేసిన తీరును కొనియాడారు.

7 కొత్త ఒప్పందాలు..

వియత్నాంతో శాస్త్రీయ పరిశోధన, అణు, పునరుత్పాదక శక్తి, పెట్రోరసాయనాలు, రక్షణ, క్యాన్సర్ చికిత్స సహా ఆయా రంగాల్లో మొత్తం ఏడు కొత్త ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మోదీ వెల్లడించారు. రెండు దేశాల మధ్య సామాజిక-సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసేందుకు కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రెండు దేశాలు సభ్యులుగా అవుతాయని, అంతర్జాతీయ ప్రయోజనాలకు అనుగణంగా రెండు దేశాల మధ్య పరస్పర సహకారం కీలకమన్నారు.

ఇదీ చూడండి: గణతంత్ర వేడుకలకు 'బోరిస్​'​ హాజరవుతారా?

ABOUT THE AUTHOR

...view details