తెలంగాణ

telangana

By

Published : Mar 27, 2020, 8:00 AM IST

ETV Bharat / bharat

'నాన్నా బయటికి వెళ్లొద్దు.. కరోనా వస్తుంది'

కర్తవ్య నిర్వహణలో భాగంగా పోలీసులకు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి. దేశం ఇలాంటి విపత్కర సమయంలో ఉన్నప్పుడు పోలీసులు ఇంట్లో కూర్చోలేరు. అయితే వారి కుటుంబాల పరిస్థితి వేరు. మహారాష్ట్రలో ఓ పోలీసు కానిస్టేబుల్​తో ఆయన కొడుకు.. నాన్నా బయటకు వెళ్లొద్దు అని ఏడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీసు కుటుంబాల పరిస్థితికి అద్దం పడుతుంది.

maha cop
మహారాష్ట్ర పోలీసు

భారత్​లో కరోనా వైరస్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్​డౌన్​ ప్రకటించారు ప్రధాని నరేంద్రమోదీ. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని సూచించారు. అయితే ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ ప్రజలు వీధుల్లోకి వస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది.

బయటికి వచ్చిన వారిపై పోలీసులు లాఠీలు ఝళిపించటం సహా అనేక రకాలుగా శిక్షిస్తున్నారు. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి రాకుండా నిరంతరం పహారా కాస్తున్నారు. అయితే పోలీసులు తీరుపై విమర్శలు వస్తోన్నా.. వారి కుటుంబ సభ్యుల ఆవేదన మరోలా ఉంది.

నాన్నా వెళ్లొద్దు..

మహారాష్ట్రలోని ఓ పోలీస్​ అధికారి విధుల నిమిత్తం వెళుతుంటే అతని కుమారుడు అడ్డుకున్నాడు. బయటికి వెళితే కరోనా వస్తుంది.. వద్దు నాన్న అంటూ ఏడుస్తూ బతిమాలాడు. ఈ వీడియోను మహారాష్ట్ర పోలీసులు ట్విట్టర్​లో పోస్ట్​ చేయగా సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చూడండి:పోలీసుల నయా స్టైల్​- రోడ్లపైకి వచ్చినవారికి వెరైటీ శిక్షలు

ABOUT THE AUTHOR

...view details