పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచిప్రారంభం కానున్న నేపథ్యంలో కొవిడ్-19 పరీక్షలు చేయించుకున్నారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు. పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ విధిగా కరోనా పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేశారు. పరీక్షలో నెగెటివ్ వచ్చిన వారినే పార్లమెంటు ఆవరణలోకి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
పరీక్షలు చేయించుకుంటేనే పార్లమెంటులోకి అనుమతి - వెంకయ్య నాయుడు
పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. నెగెటివ్ వచ్చినవారికే పార్లమెంటు ఆవరణలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. కొవిడ్-19 పరీక్షలను ఆయన శుక్రవారం చేయించుకున్నారు.
పరీక్షలు చేయించుకుంటేనే ఎంపీలకు పార్లమెంటులోకి అనుమతి
పార్లమెంటు స్థాయీ సంఘం, ఇతర కమిటీల నివేదికలు, రోజు వారీ డాక్యుమెంట్లు కూడా ఎలక్ట్రానిక్ పద్దతిలోనే సర్క్యూలేట్ చేయనున్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు.