ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు కరోనా పాజిటివ్ - ఉపరాష్ట్రపతి తాజా సమాచారం
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఈరోజు చేసిన వైద్య పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది.
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్టు ఉపరాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది. ఈరోజు ఉదయం కరోనా పరీక్షలు చేయించుకున్నారని.. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలూ లేవని తెలిపింది. వెంకయ్యనాయుడు ఆరోగ్యంగానే ఉన్నట్టు కార్యాలయం వెల్లడించింది. వైద్యులు హోం క్వారంటైన్‌లోనే ఉండాలని సూచించారని అధికారులు పేర్కొన్నారు. ఆయన సతీమణి ఉషా నాయుడుకి కరోనా నెగెటివ్ వచ్చిందని, స్వీయ నిర్బంధంలోనే ఉన్నట్టు అధికారులు ట్విట్టర్లో పేర్కొన్నారు.