తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనాను జయించిన వెంకయ్య నాయుడు - వెంకయ్య నాయుడు వార్తలు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనాను జయించారు. గత నెల 29న కొవిడ్​ బారినపడిన ఆయనకు.. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా లేదని తేలింది. అయితే.. వైద్యుల సలహా మేరకు మరికొంత కాలం స్వీయ నిర్బంధంలోనే ఉంటున్నట్టు వెల్లడించారు వెంకయ్య.

Naidu recovers from COVID-19
కరోనా నుంచి జయించిన ఉపరాష్ట్రపతి వెంకయ్య

By

Published : Oct 12, 2020, 6:00 PM IST

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కరోనా నుంచి కోలుకున్నారు. కొద్ది రోజుల క్రితం కొవిడ్​ సంక్రమణకు గురైన ఆయనకు వైరస్ లక్షణాలేవీ కనిపించలేదు. అయితే.. వైద్యుల సూచన మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఎయిమ్స్ వైద్యుల బృందం సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగెటివ్​గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు.

అయినా నిర్బంధంలోనే..

తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయితే వైద్యుల సలహా మేరకు మరికొంత కాలం పాటు నిర్బంధం కొనసాగించడం మంచిదని భావిస్తున్నట్టు తెలిపారు వెంకయ్య. ఈ మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇంటి నుంచే పని చేయనున్నట్టు పేర్కొన్నారు.

'వారందరికీ కృతజ్ఞతలు'

స్వీయ నిర్బంధ కాలంలో ఉత్తరాలు, మెయిల్స్, సందేశాల ద్వారా.. తాను కోలుకోవాలని ఆకాంక్షించిన వారందరికి ధన్యవాదాలు తెలిపారు ఉపరాష్ట్రపతి. చికిత్స అందించిన వైద్య సిబ్బంది, అండగా నిలిచిన వ్యక్తిగత సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పారు.

ఇదీ చదవండి:భాజపాలో 'సింధియా' ఒంటరి పోరు- ఎందుకు?

ABOUT THE AUTHOR

...view details