శ్రీశ్రీ రవిశంకర్ నేతృత్వంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వలంటీర్లు తయారుచేసిన సామాజిక మాధ్యమ యాప్ 'ఎలిమెంట్స్'ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 1080 మంది ఐటీ నిపుణులు.. విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా ఎలిమెంట్స్‌ను రూపొందించడం హర్షించదగిన విషయమని కొనియాడారు.
మేకిన్ ఇండియా ద్వారా
ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్ఫూర్తితో మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా తయారుచేసిన ఈ యాప్ అనేక విధాలుగా ప్రజలకు ఉపయోగపడుతుందన్నారు.