దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. కొవిడ్-19 వ్యాప్తిని అడ్డుకునేందుకు ఆదివారం చేపట్టే జనతా కర్ఫ్యూకు మద్దతుగా స్వచ్ఛందంగా ఇళ్లకే పరిమితం కావాలని దేశ ప్రజలను కోరారు వెంకయ్య.
" వైరస్ ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాప్తి చెందుతున్న కారణంగా దానిని నివారించేందుకు సామాజిక దూరం పాటించడమే ప్రభావవంతమైన చర్య. దాని ద్వారా తమను తాము కాపాడుకోవటమే కాదు.. ఇతరులను కాపాడినట్లవుతుంది. వైరస్‌పై కలిసికట్టుగా పోరాడేందుకు రాజకీయ పార్టీలు, పౌర సంస్థలు జనతా కర్ఫ్యూపై అవగాహన కల్పించాలి. ఈ సవాల్‌ను ఎదుర్కొనేలా ఇతరులను ప్రోత్సహించటం ప్రతి పౌరుడి బాధ్యత. "