మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దేశ ప్రజలు, శివ భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. మహాదేవుడి ఆశీస్సులతో అందరికీ సుఖశాంతులు కలగాలని ప్రార్థించారు.
"ప్రపంచంలోని శివ భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సమస్యలను అధిగమించేందుకు ప్రతి ఒక్కరికీ జ్ఞానం, ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను."