తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అత్యుత్తమ నాయకుల్లో పారికర్ ఒకరు:వెంకయ్య - మనోహర్​ పారికర్

దివంగత నేత మనోహర్​ పారికర్​ కుటుంబాన్ని కలిసి సానుభూతి తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. పారికర్​ చిత్రపటానికి నివాళులర్పించారు. మాజీ రక్షణమంత్రి​తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు వెంకయ్య.

మనోహర్​ పారికర్​ కుటుంబాన్నికలిసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By

Published : Mar 24, 2019, 5:07 PM IST

Updated : Mar 24, 2019, 5:42 PM IST

అత్యుత్తమ నాయకుల్లో పారికర్ ఒకరు:వెంకయ్య
పనాజీలో గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుటుంబాన్ని పరామర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఒక రోజు పర్యటనలో భాగంగా గోవాకు చేరుకున్న వెంకయ్య నేరుగా దోనా పౌలాలోని పారికర్​ నివాసానికి చేరుకున్నారు. పారికర్​ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. పారికర్​తో 30 ఏళ్ల అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు వెంకయ్య.

"ఈ రోజు గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్​ పారికర్​ కుటుంబాన్ని కలిశాను. హృదయపూర్వక నివాళి అర్పిస్తున్నాను. పారికర్​తో నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఆధునిక కాలంలో​ అత్యుత్తమ నాయకులలో పారికర్​ ఒకరు. నిరాడంబరత కలిగిన నాయకుడు. సమగ్రతకు పారికర్​ మరో రూపం. ఆయన మరణం దేశానికి తీరని లోటు. ఆయన ఆదర్శాలను ఆచరించటం, ప్రజాసేవలో వారిని అనుసరించటమే మనం ఆయనకిచ్చే నివాళి"

- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి.

ఈ నెల 17న మనోహర్​ పారికర్ క్లోమగ్రంథి వ్యాధితో కన్నుమూశారు.

Last Updated : Mar 24, 2019, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details