నైతిక విలువలతో కూడిన విద్యను భావితరానికి అందించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఐక్యరాజ్యసమితి సమాచార కేంద్రం భారత్, భూటాన్ భాగస్వామ్యంతో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'హార్ట్ ఫుల్ నెస్ ఆల్ ఇండియా ఎస్సే రైటింగ్ ఈవెంట్ 2020'ని ఉపరాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు.
'నైతిక విలువలతో కూడిన విద్య భావితరానికి అవసరం' - venkaiah naidu recent news'
విలువల ఆధారిత విద్యావ్యవస్థను కొనసాగించాలని అభిప్రాయపడ్డారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. శ్రీరామంచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యారంగంలో కేంద్రం తీసుకొస్తున్న సంస్కరణలనూ ఆయన ప్రశంసించారు.
'నైతిక విలువలతో కూడిన విద్య భావితరానికి అవసరం'
వసుధైక కుటుంబ విధానంతో భారతావని ముందుకెళ్తోందన్న వెంకయ్యనాయుడు.. ఇతరుల కోసం జీవిస్తే ఎక్కువకాలం జీవిస్తామన్నారు. రేపటి తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తుందని ఆయన తెలిపారు. విలువల ఆధారిత విద్యావ్యవస్థను కొనసాగించాలన్నారు వెంకయ్య. కరోనా కష్టకాలన్ని యావత్ ప్రపంచం తర్వలోనే అధిగమిస్తుందన్న ఆశాభావాన్ని ఉపరాష్ట్రపతి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హార్ట్ ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ కమలేష్ పటేల్ పాల్గొన్నారు.