నూతన నౌకాదళాధిపతిగా కరమ్‌బీర్ భారత నావికాదళానికి నూతన అధిపతి రాబోతున్నారు. ప్రస్తుతం వైస్ అడ్మిరల్‌గా ఉన్న కరమ్‌బీర్ సింగ్ దళాధిపతిగా ఎంపికయ్యారు. మే 30తో ప్రస్తుత అడ్మిరల్ సునీల్ లాంబా పదవీ కాలం ముగుస్తుంది. మే 31న ఆ బాధ్యతలను సింగ్ స్వీకరిస్తారని రక్షణ శాఖ ప్రకటించింది. సంప్రదాయ పద్ధతిలో అనుభవ దృష్ట్యా కాకుండా ప్రతిభ ఆధారంగా సింగ్‌ను ఎంపిక చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కరమ్‌బీర్ కన్నా అండమాన్ నికోబార్ కమాండర్ ఇన్‌చీఫ్ వైస్ అడ్మిరల్ విమల్ వర్మ సీనియర్.
37 ఏళ్లలో నాలుగు నౌకలకు కమాండర్
ప్రస్తుతం విశాఖపట్నంలో తూర్పు నౌకా కమాండ్ ఇన్‌చీఫ్‌గా ఉన్నారు కరమ్‌బీర్. ఇంతకు ముందు నావికా దళ ఉప బాధ్యుడిగా, ఉద్యోగుల ఉప బాధ్యుడిగా పని చేశారు. మొత్తంగా 37 ఏళ్లలో నాలుగు నౌకలకు కమాండర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
మొదటి పైలట్
1959 నవంబర్ 3న కరమ్‌బీర్ జన్మించారు. 1982 జులై 1న నేవీలో అడుగుపెట్టారు. 1982లో చేతక్, కమోవ్ హెలికాప్టర్లకు పైలట్‌గా వ్యవహరించారు. నేవీలో మొదటి పైలట్‌గా గుర్తింపు పొందారు. మరో మూడేళ్ల కాలం లేదా 62 ఏళ్లు వచ్చే వరకు సింగ్ నావికా దళాధిపతిగా కొనసాగుతారు.
ఇదీ చూడండి:పవిత్రయుద్ధం మూర్ఖత్వం..జీహాద్‌పై కశ్మీరీల ఆగ్రహం!