తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రామమందిర నిర్మాణం కోసం వీహెచ్​పీ దేశవ్యాప్త ప్రచారం - VHP CAMPAIGN

రామమందిరం నిర్మాణం కోసం విరాళాలు సేకరించేందుకు.. దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపింది విశ్వ హిందూ పరిషత్​(వీహెచ్​పీ).మొత్తంగా 4 లక్షల గ్రామాల్లోని కోటి కుటుంబాలను కలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

VHP to launch mega fund raising campaign for Ram temple
రామమందిర నిర్మాణం కోసం వీహెచ్​పీ దేశవ్యాప్త ప్రచారం

By

Published : Dec 17, 2020, 9:10 AM IST

అయోధ్య రామాలయ నిర్మాణం కోసం దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తామని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్​పీ) తెలిపింది. ఈ ‌ప్రచారం ద్వారా ఆలయ నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తామన్నారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజైన జనవరి 14 నుంచి మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 27 వరకు 44 రోజుల యాత్ర చేపట్టనున్న వీహెచ్‌పీ స్పష్టం చేసింది.

ప్రచారంలో విరాళాలు పొందేందుకు 10, 100, 1000 రూపాయల కూపన్లు విశ్వహిందు పరిషత్‌ తయారు చేసింది. రూ. 2 వేల కంటే ఎక్కువ విరాళం ఇచ్చిన వారికి రశీదులు ఇవ్వాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా 4 లక్షల గ్రామాల్లోని కోటి కుటుంబాలకుపైగా చేరుకోవడమే లక్ష్యంగా యాత్ర చేపడుతున్నట్లు వీహెచ్‌పీ పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details