తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అయోధ్య విజయానికి గుర్తుగా దేశవ్యాప్త సంబరాలు' - VHP to hold programmes to 'celebrate' SC verdict on Ram temple

అయోధ్య భూవివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును విజయంగా భావిస్తూ దేశమంతటా సంబరాలు చేసుకోనున్నట్లు విశ్వహిందూ పరిషత్​ తెలిపింది. సుమారు 200 ప్రాంతాల్లో అతి పెద్ద రథయాత్రను చేపట్టనున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు కరోనా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తంగా ఉంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపింది.

VHP to hold programmes to 'celebrate' SC verdict on Ram temple
అయోధ్య తీర్పుతో దేశమంతటా సంబరాలకు వీహెచ్​పీ సిద్ధం

By

Published : Mar 5, 2020, 6:04 AM IST

రామజన్మభూమిపై సుప్రీంకోర్టు తీర్పును విజయంగా భావిస్తూ సంబరాలు చేసుకోనున్నట్లు విశ్వహిందూ పరిషత్ తెలిపింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా సుమారు 200 ప్రాంతాల్లో.. మార్చి 25 నుంచి ఏప్రిల్​ 25 వరకు అతిపెద్ద రథయాత్రను చేపట్టనున్నట్లు వీహెచ్​పీ ప్రధాన కార్యదర్శి మిలింద్​ పరాండె స్పష్టం చేశారు.

గతేడాది నవంబరులో అయోధ్య రామమందిర నిర్మాణానికి ఓ ట్రస్టు ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. మరో ప్రాంతంలో మసీదు కోసం సున్నీ వక్ఫ్​ బోర్డుకు 5 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణం కోసం ఫిబ్రవరిలో 15మంది సభ్యులతో ట్రస్టును ఏర్పాటు చేసింది కేంద్రం.

కరోనాతో అప్రమత్తం

ప్రస్తుతం కరోనా వైరస్​ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఆరోగ్యపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని విశ్వహిందూ పరిషత్​ వివరించింది.

సీఏఏ అల్లర్లపై..

కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ఎంతో మంచి నిర్ణయమని పేర్కొంది. దీని వల్ల ముస్లింలపై ఎలాంటి ప్రభావం పడదని ఉద్ఘాటించింది.

ABOUT THE AUTHOR

...view details