పొరుగుదేశాలతో జరిగిన యుద్ధాల్లో కల్నల్‌గా ప్రముఖ పాత్ర పోషించిన మాజీ సైన్యాధికారి ఆర్ఎన్ చిబ్బర్ కన్నుమూశారు. 1962లో భారత్-చైనాతో యుద్ధంలో ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఆయన... 1965, 1971లలో భారత్-పాకిస్థాన్ యుద్ధాల్లో ధైర్యసాహాలతో పోరాడారు.
మాజీ సైన్యాధికారి ఆర్ఎన్ చిబ్బర్ కన్నుమూత - Major General (Retired) R N Chibber death news
భారత్-చైనా, భారత్-పాకిస్థాన్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన మాజీ సైన్యాధికారి ఆర్ఎన్ చిబ్బర్ కన్నుమూశారు. సైనిక విధుల్లో చేరి, దేశానికి ఆయన చేసిన సేవ, యుద్ధంలో చూపిన తెగువకు గానూ 'విశిష్ట్ సేవా మెడల్' అందుకున్నారు.
మాజీ సైన్యాధికారి ఆర్ఎన్ చిబ్బర్ కన్నుమూత
1934లో జన్మించిన ఆయన... సైన్యంలో చేరాలనే మక్కువతో 1955లో విధుల్లోకి వచ్చారు. అప్పటి నుంచి శ్రద్ధ, భక్తితో దేశానికి సేవలందించారు చిబ్బర్. ఆయన వీరత్వానికి గాను 'విశిష్ట సేవా మెడల్' కూడా అందుకున్నారు. చిబ్బర్... సమర్థుడైన అధికారి మాత్రమే కాదు... గొప్ప మానవతావాదిగా, మంచి మనసున్న వ్యక్తిగా తనకంటూ ఓ పేరు సంపాదించుకున్నారు.
ఇదీ చూడండి:ఉగ్రవాద నిర్మూలనకు కలిసిరావాలి: ఉపరాష్ట్రపతి