తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశ రాజధానిని కమ్మేసిన పొగ మంచు - డెన్స్​ ఫాగ్​ దిల్లీ

దిల్లీలో పొగ మంచు విపరీతంగా కురుస్తోంది. దృశ్య నాణ్యత పూర్తిగా పడిపోయినట్ల వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో దిల్లీలో రైళ్లు, విమానాల రాకపోకల్లో ఆలస్యం ఎదురవుతోంది.

delhi very dense fog
దేశ రాజధానిని కప్పేసిన పొగ మంచు!

By

Published : Jan 16, 2021, 10:51 AM IST

దేశ రాజధానిని పొగ మంచు కప్పేసింది. దీనివల్ల దిల్లీలో శనివారం దృశ్యనాణ్యత పూర్తిగా పడిపోయినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. గాలినాణ్యత ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు తెలిపింది. దీంతో పలు చోట్లు ట్రాఫిక్​ ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

పొగమంచు నేపథ్యంలో క్యాట్​ ఐ విమానాలకు మాత్రమే లాండింగ్​కు దిల్లీ విమానాశ్రయ అధికారులు అవకాశం కల్పించారు. దీనివల్ల విమానాలతో పాటు, పలు రైలు సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. దిల్లీలో 6.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఇదీ చూడండి:కరోనా వ్యాక్సినేషన్​ ప్రక్రియకు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details