అత్యాధునిక ఆయుధాలు, రక్షణ పరికరాలను కొనుగోలు చేయడం ఇతర దేశాల ఆక్రమణ కోసం కాదని.. తమ దేశ ఆత్మ రక్షణకేనని రక్షణమంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. ఫ్రాన్స్‌లో రఫేల్ యుద్ధ విమానంలో విహరించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"ఫిబ్రవరి 2021 కల్లా 18 రఫేల్ విమానాలు భారత్‌కు అందుతాయి. 2022 మే లోగా మొత్తం 36 యుద్ధ విమానాలు అందుతాయి. రఫేల్ వల్ల వాయుసేన శక్తిసామర్థ్యాలు మరింత బలపడతాయి. ఎవరినైనా ఆక్రమించుకోవడానికి శక్తిసామర్థ్యాలను పెంచుకోము.. ఆత్మ రక్షణ కోసమే. నేను జెట్‌లో ప్రయాణించాను. ఎంతో సౌకర్యంగా ఉంది. నా జీవితంలో ఇదొక అద్భుతమైన క్షణం. యుద్ధ విమానంలో కూర్చుని సూపర్ సానిక్ వేగంతో దూసుకెళ్తానని ఎన్నడూ అనుకోలేదు."
--- రాజ్‌నాథ్, రక్షణమంత్రి.
యుద్ధ విమానాల్లో ప్రయాణించడం రాజ్‌నాథ్‌కు ఇది కొత్తేమీ కాదు. సెప్టెంబర్ 19న బెంగళూరులో తేజస్ యుద్ధ విమానంలో విహరించారు.