శబరిమల ఆలయంలోకి అన్ని వయస్కుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో ఇచ్చిన తీర్పు అంతిమం కాదని సుప్రీం కోర్టు స్పష్టంచేసింది. ఈ విషయంపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టనుందని పేర్కొంది.
ఇటీవల ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నారని మహిళా కార్యకర్త బిందు అమ్మిని వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్పై వచ్చే వారం విచారణ చేపట్టేందుకు సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గతేడాది ఇచ్చిన తీర్పు అంతిమం కాదని, ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది నిర్ణయం తీసుకుంటుందని ఈ సందర్భంగా స్పష్టంచేసింది.