కొవిడ్-19తో కునారిల్లిన ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన భారీ ప్యాకేజీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. భారత్ స్వావలంబనకు ప్యాకేజీ ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఆర్థిక ప్యాకేజీని స్వాగతించిన ఉపరాష్ట్రపతి - ఆత్మ నిర్భర భారత్
ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్వాగతించారు. దేశ ఆర్థిక స్వావలంబనకు ఊతమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు సహా వివిధ వర్గాల వారికి ఈ ప్యాకేజీ చేయూతనిస్తుందని ఆయన పేర్కొన్నారు.
మోదీ 'ప్యాకేజీ'ని స్వాగతించిన ఉపరాష్ట్రపతి
ఆత్మనిర్భర భారత్ స్వప్న సాధనకు సంస్కరణలు చేపట్టాల్సిన తరుణం ఇదేనని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఐదు అంశాలపై ప్రత్యేక దృష్టితో స్థానిక పరిశ్రమలకు చేయూతనివ్వాలని సూచించారు. తద్వారా భారత్ అంతర్జాతీయంగా పోటీపడేలా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. కరోనా సవాళ్లను ఎదుర్కునేందుకు ప్యాకేజీ ఉపయుక్తంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు. రైతులు, కార్మికులు, ఉద్యోగులు, వివిధ వర్గాలకు మేలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.