రాజ్యసభ ఉద్యోగుల హౌసింగ్ కాంప్లెక్స్‌కు శంకుస్థాపన చేశారు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు. దిల్లీలోని ఆర్కే పురమ్‌లో రూ. 46 కోట్లతో ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. 2003లో ఈ ప్రాజెక్టుకు స్థలం కేటాయించినప్పుటికీ.. పనులు ప్రారంభించటంలో జాప్యం కావటంపై ఆందోళన వ్యక్తం చేశారు వెంకయ్య.
" 17 ఏళ్లపాటు జాప్యం ఫలితంగా రాజ్యసభ సచివాలయంపై అనవసరపు ఖర్చులు చేరి అదనపు భారం పడింది. విలువైన భూ వనరులను ఉపయోగించుకోక పోవటానికి కారణం సామాజిక, ఆర్థిక, చట్ట, పరిపాలనాపరమైన అడ్డంకులే. ఆ అడ్డంకులు తొలగించేందుకు గత రెండేళ్లలో పలుమార్లు అధికారులతో చర్చలు జరిపాం."