తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెల్లూర్​ లోక్​సభ స్థానం ఎన్నిక ఖరారు - ఓట్లు

ఏప్రిల్​ 16న రద్దయిన తమిళనాడు వెల్లూర్​ లోక్​సభ స్థానం ఎన్నిక ఆగస్టు 5న జరగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 9న ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది.

వెల్లూర్​ లోక్​సభ స్థానం ఎన్నిక ఖరారు

By

Published : Jul 4, 2019, 3:23 PM IST

తమిళనాడులోని వెల్లూర్​ లోక్​సభ నియోజకవర్గం ఎన్నికపై గురువారం ఎన్నికల సంఘం ఓ ప్రకటన విడుదల చేసింది. వెల్లూర్​ స్థానానికి ఆగస్టు 5న పోలింగ్​ నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్​ 18న వెల్లూర్​ స్థానానికి పోలింగ్ జరగాల్సి ఉంది. కానీ ఆ ప్రాంతంలో డీఎంకే అభ్యర్థి సన్నిహితుల వద్ద భారీగా అక్రమ నగదు పట్టుబడటం వల్ల ఎన్నికను ఈసీ రద్దు చేసింది.

ఆగస్టు 9న లెక్కింపు...

వెల్లూర్​ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్​ను జులై 11న విడుదల చేయనుంది ఈసీ. అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయడానికి చివరి తేది జులై 18. ఆగస్టు 9న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇదీ చూడండి:- చైనాలో ప్రచండ గాలులకు ఆరుగురు బలి

ABOUT THE AUTHOR

...view details