తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఖతార్​ రాజు మెచ్చిన కేరళ పనస పంట..!

కేరళకు చెందిన వర్గీస్​ తారకన్​ అనే రైతు పనస పంట సాగులో మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. ఈయన సాగు చేసిన పనస పంటను ఖతార్​ రాజు మెచ్చారు. ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఈ పంటను సాగు చేయడానికి వర్గీస్​ను ఆహ్వానించారు.

By

Published : Mar 23, 2019, 9:13 AM IST

ఖతార్​ రాజు మెచ్చిన కేరళ పనస పంట

ఖతార్​ రాజు మెచ్చిన కేరళ పనస పంట
కేరళలో వర్గీస్ తారకన్​ అనే రైతు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. కాలంతో సంబంధం లేకుండా పనస పంట సాగులో మంచి దిగుబడి పొందుతూ అందిరి చేత ఔరా అనిపించుకుంటున్నారు. అంతేకాదు... వ్యవసాయంలో సరికొత్త పద్ధతులు పాటిస్తూ... రాష్ట్ర ప్రభత్వం ప్రదానం చేసే 'క్షోని మిత్రా' అవార్డునూ సొంతం చేసుకున్నారు. 'వాఫా' పురస్కారానికి కూడా ప్రభుత్వం ఈయన పేరును ప్రతిపాదించింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారినందున చాలా మంది తన పనస తోటను చూసేందుకు వస్తున్నారని వర్గీస్ తారకన్​ తెలిపారు.

తాజాగా ఈయన పనస సాగు వివరాలు ఖతార్​ వరకు చేరాయి. ఖతార్ రాజు తన వ్యవసాయ క్షేత్రంలో ఈ పంట సాగు చేసేందుకు వర్గీస్​ను ఆహ్వానించారు.

" నాలుగు రోజుల క్రితం ఇద్దరు ఖతార్​ మహారాజు ప్రతినిధులు నన్ను సంప్రదించారు. ఆయనకు సంబంధించిన మూడు కిలోమీటర్ల స్థలంలో పనస తోటను ఏర్పాటు చేయటానికి నన్ను అక్కడకు రమ్మన్నారు. వారి పొలంలో పనస పంట వేయటానికి కావాల్సిన వ్యవసాయ సామగ్రిని సమకూర్చమన్నారు. ఖతార్​ రాజును నా తోటకు వచ్చి పనాస రుచి చూడమని ఆహ్వానించాను. ఆయనకు నాతోటలోని పనస నచ్చితే నేనక్కడకు వస్తానన్నాను."
- వర్గీస్ తారకన్​, పనస రైతు

రబ్బరు పంట కాదని పనస వైపు

కేరళ, త్రిస్సూర్​ జిల్లాలోని వేలూరు గ్రామానికి చెందిన వర్గీస్ తారకన్​... గతంలో రబ్బరు సాగు చేసేవారు. రబ్బరు పంటకు ధర కనిష్ఠ స్థాయికి పడినందున తన అయిదు ఎకరాల పొలంలో రబ్బరు పంటను నరికేసి పనస పంటను వేశారు. మొదట్లో వర్గీస్​ను అందరూ వింతగా చూశారు. అయితే ప్రస్తుతం 1000 పనస చెట్లను సాగుచేస్తోన్న తారకన్​ అందరిచేత శభాష్​ అనిపించుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details