తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈడీ పిటిషన్​పై వాద్రా స్పందన కోరిన కోర్టు - డైరెక్టరేట్

హవాలా కేసులో రాబర్ట్ వాద్రాకు కింది కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్​ను రద్దు చేయాలన్న ఈడీ పిటిషన్​పై విచారించింది దిల్లీ హైకోర్టు. దీనిపై స్పందించాలని వాద్రాకు సూచించింది.

ఈడీ పిటిషన్​పై వాద్రా స్పందన కోరిన కోర్టు

By

Published : May 27, 2019, 2:35 PM IST

రాబర్ట్ వాద్రా ముందస్తు బెయిల్​ను రద్దు చేయాలన్న ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ పిటిషన్​పై విచారించింది దిల్లీ హైకోర్టు. ఈడీ పిటిషన్​పై స్పందించాలని వాద్రాకు జస్టిస్ చందర్​శేఖర్ నోటీసులు జారీ చేశారు.

హవాలా కేసులో రాబర్ట్ వాద్రాకు ఏప్రిల్ 1న కిందికోర్టు మంజూరు చేసిన బెయిల్​ను సవాల్​ చేస్తూ ఈడీ దిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు... ఈడీ పిటిషన్​పై సమాధానమివ్వాలని వాద్రాను ఆదేశించింది. కేసుతో సంబంధముందని ఆరోపణలెదుర్కొంటున్న వాద్రా సన్నిహితుడు మనోజ్​ అరోరానూ స్పందించాలని కోరింది.

ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. రాబర్ట్ వాద్రా ఈ కేసు విచారణకు సహకరించని కారణంగా ఈడీ కస్టడీకి అప్పగించాలని కోరారు. నేరానికి సంబంధించిన మౌలిక అంశాలను కింది కోర్టు విచారించలేదని ఈడీ తరఫున వాదించారు.

వాద్రా బావమరిది, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హవాలా సొమ్ముతో లండన్​లో ఆస్తి కొన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఇదీ చూడండి: జూన్​ 6-15 వరకు 17వ లోక్​సభ తొలి సమావేశం!

ABOUT THE AUTHOR

...view details