వందే భారత్ మిషన్ నాలుగో దశను జులై 5 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది కేంద్రం. ఇందులో భాగంగా 170 ఎయిరిండియా ప్రత్యేక విమానాలను 17 దేశాలకు పంపనున్నట్లు ప్రకటించింది.
విమానాలు పంపించే దేశాలివే..
నాలుగో దశ మిషన్లో భాగంగా కెనడా, అమెరికా, బ్రిటన్, కెన్యా, శ్రీలంక, ఫిలిప్పీన్స్, కిర్గిస్థాన్, సౌదీ అరేబియా, బంగ్లాదేశ్, థాయ్లాండ్, దక్షిణాఫ్రికా, రష్యా, ఆస్ట్రేలియా, మయన్మార్, జపాన్, ఉక్రెయిన్, వియత్నాం దేశాలకు ఎయిరిండియా విమానాలను పంపనున్నట్లు తెలిపింది. ఇందులో ఇండో- యూకే మార్గం ద్వారా 38 విమానాలు, ఇండో- యూఎస్ మార్గంలో 32 విమానాలను నడపనున్నారు. సౌదీ అరేబియాకు 26 విమానాలు తమ సేవలను అందించనున్నాయి.