వందే భారత్ మిషన్‌లో భాగంగా జూన్ 4 నుంచి 6వ తేదీ మధ్య అదనపు విమానాలు నడపనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, స్వీడన్ దేశాల నుంచి భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఈ అదనపు విమానాలు నడుపుతున్నట్లు వెల్లడించారు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి. ఈ మేరకు ట్వీట్ చేశారు.
" వందే భారత్ మిషన్‌లో భాగంగా ఎయిర్ ఇండియా అదనపు విమానాలను ప్రకటించింది. జూన్ 4న దిల్లీ నుంచి ఆక్లాండ్, జూన్ 5న దిల్లీ నుంచి చికాగో, స్టాక్‌హోం, జూన్ 6న దిల్లీ నుంచి న్యూయార్క్, ఫ్రాంక్ఫర్ట్, సియోల్, ముంబయి నుంచి లండన్, న్యూయార్క్‌కు ఈ విమానాలు బయలుదేరనున్నాయి."
– హర్దీప్ సింగ్ పూరి, పౌర విమానయాన శాఖ మంత్రి.