తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మనాలీలో వాజ్​పేయీ విగ్రహానికి శంకుస్థాపన - విగ్రహం

హిమాచల్​ ప్రదేశ్​లో మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ విగ్రహాన్ని నిర్మించనున్నారు. విగ్రహ నిర్మాణానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​ శంకుస్థాపన చేశారు.

మనాలీలో వాజ్​పేయీ విగ్రహానికి శంకుస్థాపన

By

Published : Aug 17, 2019, 9:09 AM IST

Updated : Sep 27, 2019, 6:28 AM IST

మనాలీలో వాజ్​పేయీ విగ్రహానికి శంకుస్థాపన

హిమాచల్​ప్రదేశ్​లోని మనాలీలో మాజీ ప్రధాని అటల్​ బిహారీ వాజ్​పేయీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​. ఆగస్టు 16న వాజ్​పేయీ​ ప్రథమ వర్థంతి సందర్భంగా నిర్మాణం తలపెట్టింది హిమాచల్​ ప్రభుత్వం.

అటల్​ నివాళి కార్యక్రమంలో ఠాకూర్​ వీడియో కాన్ఫరెన్స్​లో​ మాట్లాడారు.

"అటల్​ బిహారీ వాజ్​పేయీ గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తి. ప్రపంచ స్థాయి నాయకుడు. దేశంలో రహదారుల విస్తరణ కోసం ప్రధాన్​ మంత్రి గ్రామ్​ సడక్​ యోజన, జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు వంటి మహత్తరమైన పథకాలను రూపొందించారు. దేశానికి మరువలేని సేవలందించారు."

- జైరాం ఠాకూర్​, హిమాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రి.

ఇదీ చూడండి:గాంధీ-150: అక్షర సైనికుడిగా మహాత్ముడి ముద్ర

Last Updated : Sep 27, 2019, 6:28 AM IST

ABOUT THE AUTHOR

...view details