తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వాజ్​పేయీ​ సృష్టించిన రాష్ట్రానికి మోదీ రాకతో అభివృద్ధి కళ' - ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికలు

ఝార్ఖండ్​ రాష్ట్రంలో గత ప్రభుత్వాల హయాంలో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. రఘుబర్​దాస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు. మాజీ ప్రధాని అటల్​ జీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే... ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రఘుబర్​దాస్​ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు.

Jharkhand
కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

By

Published : Nov 28, 2019, 4:46 PM IST

Updated : Nov 28, 2019, 10:46 PM IST

'వాజ్​పేయీ​ సృష్టించిన రాష్ట్రానికి మోదీ రాకతో అభివృద్ధి కళ'

ఝార్ఖండ్​ రాష్ట్రాన్ని మాజీ ప్రధాని అటల్​ బిహార్​ వాజ్​పేయీ ఇస్తే.. నేడు ప్రధాని మోదీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పేర్కొన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్​ షా. గత ప్రభుత్వాల హయాంలో ఝార్ఖండ్​లో అవినీతి రాజ్యమేలిందని ఆరోపించారు. రఘుబర్​ దాస్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క కేసూ నమోదు కాలేదన్నారు.

ఝార్ఖండ్​ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఛత్రాలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొన్నారు షా. శాసనసభ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తోన్న జేఎంఎం, కాంగ్రెస్​, ఆర్జేడీ గతాన్ని మర్చిపోకూడదని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు కాంగ్రెస్​ వైఖరిని గుర్తు చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

" ఎన్నికల్లో కాంగ్రెస్, ఝార్ఖండ్​ ముక్తి మోర్చా​ కలిసి పోటీ చేస్తున్నాయి. హేమంత్​ బాబు(హేమంత్​ సొరేన్​)కు ఒకటి చేప్పాలనుకుంటున్నా. ప్రత్యేక రాష్ట్ర సాధనకు యువత పోరాటం చేసినప్పుడు కాంగ్రెస్​ వైఖరి ఏంటో తెలపాలి. ఝార్ఖండ్​ ఏర్పాటు కోసం వందల మంది యువకులు ప్రాణాలు అర్పిస్తే.. కాంగ్రెస్​ ఏం చేసింది? రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్​ చర్యలు తీసుకోలేదు. ఝార్ఖండ్​ ఏర్పాటు ఎప్పుడు మొదలైంది? అటల్​ జీ ప్రధాని అయిన తర్వాత.. ఆయన ఝార్ఖండ్​ ఏర్పాటుకు కృషి చేశారు. ఆ కారణంగా నేడు రాష్ట్రం ఏర్పడింది. అటల్​ జీ రాష్ట్రం​ ఏర్పాటు చేస్తే.. నరేంద్ర మోదీ, రఘుబర్​ దాస్​ ఝార్ఖండ్​ను​ అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. "

- అమిత్​ షా, కేంద్ర హోంమంత్రి.

అయోధ్యలో అద్భుతమైన ఆలయం..

అయోధ్యలో రామమందిర నిర్మాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు షా. అద్భుతమైన ఆలయం నిర్మిస్తామని ప్రచారంలో భాగంగా ప్రకటించారు. అధికరణ 370, 35ఏల రద్దుతో దేశం నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టామన్నారు.

ఛత్రాలో స్టీల్​ ప్లాంట్​..

ఝార్ఖండ్​ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు షా. 38 లక్షల ఇళ్లకు విద్యుత్​ కనెక్షన్లు అందించినట్లు తెలిపారు. భాజపా అధికారంలోకి వస్తే ఛత్రాలో ఉక్కు కర్మాగారం​ నెలకొల్పుతామన్నారు. రాష్ట్రంలో నక్సలైట్లను ప్రభుత్వం 20 అడుగుల లోతులో పాతిపెట్టిందని ఉద్ఘాటించారు షా.

ఇదీ చూడండి: ఉద్ధవ్​ ప్రమాణంపై స్టేకు విజ్ఞప్తి- 'విడాకుల'తో హైకోర్టు జవాబు

Last Updated : Nov 28, 2019, 10:46 PM IST

ABOUT THE AUTHOR

...view details