సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్కు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. కేరళ హస్తం పార్టీ సీనియర్ నాయకుడు, సోనియా ముఖ్య సలహాదారు వడక్కన్ పార్టీకి రాజీనామా చేశారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.
కాంగ్రెస్కు వడక్కన్ రాజీనామా
సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది . పార్టీ సీనియర్ నాయకుడు వడక్కన్ పార్టీ వీడారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆధ్వర్యంలో భాజపాలో చేరారు.
భాజపాలో చేరిన వడక్కన్
"నేను ఇక్కడ ఉండటానికి కారణం భద్రత బలగాల సమర్థతను కాంగ్రెస్ ప్రశ్నించటమే. పాకిస్థాన్ దాడుల అనంతరం పార్టీ స్పందన నన్ను ఎంతో భాదించింది. పార్టీకి రెండు దశాబ్దాలపైగా సేవలు అందించాను. ఇప్పుడు పార్టీ వీడటం భారంగా ఉంది. కానీ కాంగ్రెస్లో కుటుంబ పాలనే కొనసాగుతోంది. కాంగ్రెస్ వాడిపడేసే పార్టీగా తయారైంది" - వడక్కన్
కేరళ నుంచి భాజపా తరఫున వడక్కన్ లోక్సభకు పోటి చేసే అవకాశముంది.