తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యాక్సిన్​ ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నాయి' - కేంద్ర ఆరోగ్యశాఖ

భారత్​లో రెండు.. కొవిడ్​ టీకా ప్రయోగాలు తుదిదశకు చేరుకున్నాయని వెల్లడించింది జాతీయ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌. అయితే.. వ్యాక్సిన్​ వస్తే సమస్య తీరిపోయినట్లని భావించకూడదని పేర్కొంది. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, చికిత్స తీసుకోవడం ద్వారానే మహమ్మారిని అరికట్టవచ్చని తెలిపింది.

vaccine is the not only sollution for corona virus says union health ministry
'వ్యాక్సిన్​ వచ్చినంత మాత్రాన అంతా సమసిపోదు'

By

Published : Nov 17, 2020, 9:11 PM IST

దేశంలో రెండు కరోనా వ్యాక్సిన్ల ప్రయోగాలు మూడో దశకు చేరుకున్నాయని జాతీయ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ వెల్లడించింది. మొత్తం ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ట్రయల్స్‌లో ఉన్నాయని తెలిపింది. అన్ని ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నాయని చెప్పింది.

వ్యాక్సిన్‌ వల్లే అంతా సమసిపోదని గుర్తుంచుకోవాలని జాతీయ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధిపతి వి.కె.పాల్‌ పేర్కొన్నారు. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, చికిత్స తీసుకోవడం తప్పనిసరి అని సూచించారు. పండగలు, ఎన్నికల వేళ కరోనా కేసులు పెరిగే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం స్పష్టంగా తెలుస్తుందని వెల్లడించారు.

"దేశంలో వ్యాక్సిన్‌ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. సీరం వ్యాక్సిన్‌ మూడో దశ ప్రయోగాల్లో ఉంది. భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌ రూపొందిస్తున్న వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ సహకారంతో రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వీ‌ ప్రయోగాలు సాగుతున్నాయి. భారత్‌లో దాదాపుగా ఐదు వ్యాక్సిన్లు వివిధ దశల్లో ట్రయల్స్‌లో ఉన్నాయి. ఇవి రెండు, మూడో దశలో ఉన్నాయి. రష్యా వ్యాక్సిన్‌ మూడో దశకు అతి సమీపంలో ఉంది. వ్యాక్సిన్‌ వచ్చినంత మాత్రాన ఈ సంక్షోభం ముగిసిపోదు. కరోనా అంతానికి వ్యాక్సిన్ ఒక మార్గం మాత్రమే. సమయానికి పరీక్షలు చేయించుకోవడం, చికిత్స తీసుకోవడం వల్ల వైరస్​ను తరిమికొట్టొచ్చు. వ్యాక్సిన్‌ గేమ్‌ ఛేంజరే. కానీ వ్యాక్సిన్‌ ఒక్కదాని వల్లే అంతా సమసిపోదు. దీన్ని మనం గుర్తుంచుకోవాలి."

--వి.కె.పాల్,జాతీయ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధిపతి

కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. దిల్లీలో మహమ్మారి నియంత్రణకు 7 వేల ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ బృందాల సాయంతో ప్రతి ఇంటిపై నిఘా ఉంచుతామని అన్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 12 కోట్ల 65 లక్షలకుపైగా కొవిడ్ పరీక్షలు జరిగాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదీ చూడండి:దేశంలో రికార్డు స్థాయిలో తగ్గిన కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details