కరోనాకు వ్యాక్సిన్ తీర్చిదిద్ది, వాటిని అత్యవసరంగా వాడేందుకు రెండు సంస్థలు అనుమతి పొందడం భారతదేశ శాస్త్ర పురోగతికి నిదర్శనమని ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. రెండు సంస్థల వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి అనుమతి లభించడంపై సోమవారం ఆయన ఫేస్బుక్ ద్వారా స్పందించారు.
'శాస్త్ర రంగంలో పురోగతికి ఇది నిదర్శనం' - భారత్‌లో వ్యాక్సిన్ అత్యవసర అనుమతి పై వెంకయ్యనాయుడు
దేశంలో కరోనా వ్యాక్సిన్ అత్యవసర అనుమతికి రెండు సంస్థలు అనుమతి పొందండంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశ శాస్త్రరంగ పురోగతికి ఇది నిదర్శనమని అన్నారు. వ్యాక్సిన్‌ని ప్రజల వద్దకు చేర్చడానికి అంకితభావంతో పనిచేయాలని చెప్పారు.
!['శాస్త్ర రంగంలో పురోగతికి ఇది నిదర్శనం' vaccin approval is the symbol of progressive of science in india](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10121487-166-10121487-1609810937249.jpg)
శాస్త్ర రంగంలో పురోగతికి ఇది నిదర్శనం
"అత్మనిర్భర్ భారత్‌లో భారతీయులకే కాకుండా ప్రపంచంలో అందరికీ లబ్ధి కలుగుతుందనడానికి ఇదొక నిదర్శన. కరోనాకు కళ్లెం వేయడానికి ఎలా పనిచేశామో అదే స్ఫూర్తితో ఇప్పుడు ప్రజల వద్దకు వ్యాక్సిన్‌ను చేర్చాలి. ఈ విజయానికి కారకులైన అందరినీ అభినందించాలి" అని చెప్పారు.
ఇదీ చదవండి:టీకా కోసం ఈ వారమే భారత్ బయోటెక్‌తో ఒప్పందం
Last Updated : Jan 5, 2021, 7:40 AM IST