తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత సంస్కృతిని జగతికి చాటిన మహనీయుడు' - వివేకానందుని వర్ధంతి

స్వామి వివేకానందుని 118వ వర్ధంతి సందర్భంగా ట్విట్టర్ వేదికగా నివాళుల్పరించారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భారత సంస్కృతిని, వేదాలను పాశ్చాత్య దేశాలకు తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు.

V-P Naidu pays tributes to Vivekananda on death anniversary
వివేకానందుడి 118వ వర్ధంతికి ఆయన నివాళి

By

Published : Jul 4, 2020, 3:29 PM IST

స్వామి వివేకానందుని 118వవర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. వివేకానందుడి గొప్పతనాన్ని కీర్తించారు.

వివేకానందుడి 118వ వర్ధంతికి వెంకయ్య నివాళి

"వివేకానందుడు తనకున్న మేధస్సు, అపారమైన జ్ఞానం, ఉపన్యాసధోరణితో.. భారత దేశ గొప్ప ఆధ్యాత్మిక గురువుల్లో ఒకరిగా నిలిచారు. వేదాంతాలను, భారత సంస్కృతి సంప్రదాయాలను పాశ్చాత్య దేశాలకు పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఆయన."

-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

అతని ఆలోచనల నుంచి పుట్టిన వాటిలో ముఖ్యమైనది సాంఘిక సంస్కరణలు. సంపన్నమైన, సంఘటితమైన, ప్రశాంతమైన భారతావనిని నిర్మించాలనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఆయన మాటలు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని ఉపరాష్ట్రపతి అన్నారు.

ఇదీ చూడండి:ఆ మంత్రి దంపతులకు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details