తెలంగాణ

telangana

ETV Bharat / bharat

యూపీలో భూవివాదం- కాల్పుల్లో 9 మంది మృతి

ఉత్తరప్రదేశ్​ సోన్​భద్ర జిల్లా సపాహీ గ్రామంలో మొదలైన భూవివాదం 9 మంది మృతికి కారణమయింది. గ్రామ పెద్ద, ఆయన మద్దతుదారులు ప్రత్యర్థి వర్గంపై కాల్పులు జరిపారు. ఘటనలో 19 మంది గాయపడ్డారు.

కాల్పుల్లో 9 మంది మృతి

By

Published : Jul 17, 2019, 6:02 PM IST

Updated : Jul 17, 2019, 6:20 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో ఘోరం జరిగింది. సోన్​భద్ర జిల్లాలో రెండు గ్రామాల మధ్య భూవివాదం కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 9 మంది మరణించారు. 19 మంది గాయపడ్డారు.

గ్రామపెద్ద వర్గం దాష్టీకం

సోన్​భద్ర జిల్లా సపాహీ గ్రామంలో రెండు వర్గాల మధ్య ఎప్పటి నుంచో భూవివాదం నడుస్తోంది. నేడు తీవ్ర ఘర్షణగా మారింది. గ్రామ పెద్ద యజ్ఞా దత్, అతడి మద్దతుదారులు ప్రత్యర్థి వర్గంపై కాల్పులకు తెగబడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

యూపీలో భూవివాదం

గ్రామ పెద్ద బంధువులు ఇద్దరిని సోన్​భద్రలో అరెస్టు చేసినట్లు డీజీపీ వెల్లడించారు.

సీఎం ఆగ్రహం

ఈ ఘటనపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైనవారి గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని డీజీపీని ఆదేశించారు యోగి. గాయపడిన వారికి వైద్యానికి ఎలాంటి లోటు లేకుండా చూడాలని జిల్లా పాలనాధికారికి సూచించారు.

ఇదీ చూడండి: అసోం రోడ్లపై ప్రయాణానికి పడవలే దిక్కు

Last Updated : Jul 17, 2019, 6:20 PM IST

ABOUT THE AUTHOR

...view details