తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కారును ఢీకొట్టిన లారీ.. 8 మంది మృతి - కారును ఢీకొట్టిన లారీ

ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో లారీ, కారు ఢీకొన్న ఘటనలో 8 మంది మృతిచెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

కారును ఢీకొట్టిన లారీ

By

Published : Oct 7, 2019, 5:11 AM IST

Updated : Oct 7, 2019, 5:52 AM IST

ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​ ఝాన్సీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని టాండీ ఫతేపురి సమీపంలో వేగంగా దూసుకెళుతున్న లారీ.. కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం చెందారు. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమాచారం అందగానే హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. సహాయ చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మౌరానీపుర్​ ఆసుపత్రికి తరలించారు.

సీఎం దిగ్భ్రాంతి

ఘటనపై ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు పూర్తి వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని ఝాన్సీ కలెక్టర్​ను ఆదేశించారు.

ఇదీ చూడండి: ఆన్​లైన్​ గేమ్​ కోసం 78లక్షలు అప్పు- ఓటమితో ఆత్మహత్య

Last Updated : Oct 7, 2019, 5:52 AM IST

ABOUT THE AUTHOR

...view details