దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సవాల్ చేసిన బహిరంగ చర్చకు ఉత్తరాఖండ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మదన్ కౌశిక్ హాజరుకాలేదు. దెహ్రాదూన్‌లోని ఐఆర్డీటీ ఆడిటోరియంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సిసోడియా మాత్రమే హాజరయ్యారు. అభివృద్ధికి పాటుపడలేదు కాబట్టే కౌశిక్ చర్చకు గైర్హాజరయ్యారని సిసోడియా అన్నారు.
"ఉత్తరాఖండ్‌లో భాజపా నాలుగేళ్ల పాలనలో అవినీతి తప్ప ఏం జరగలేదు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులేవీ జరగట్లేదని మంత్రి గైర్హాజరుతో స్పష్టమవుతోంది. ఏదో ఒక రోజు నేతలందరూ ఇలా బహిరంగంగానే చర్చించుకుంటారని ఆశిస్తున్నా. అది ప్రజాస్వామ్యానికి మంచిది"
-మనీష్ సిసోడియా, దిల్లీ ఉపముఖ్యమంత్రి