తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆ విద్యార్థి కోసం భారత్​-నేపాల్ వంతెన రీఓపెన్ - అంతర్జాతీయ వేలాడే వంతెన నేపాల్ విద్యార్థి

పరీక్ష రాసేందుకు నేపాల్ నుంచి వచ్చిన ఓ విద్యార్థిని అభ్యర్థన మేరకు రెండు దేశాలను కలిపే వంతెనను తాత్కాలికంగా తెరిచినట్లు అధికారులు తెలిపారు. 10 నిమిషాల పాటు వంతెన తెరిచి ఉంచినట్లు చెప్పారు.

Uttarakhand: International Swing Bridge opened briefly after request from Nepali student
నేపాల్ విద్యార్థిని కోసం వంతెన తెరిచిన అధికారులు

By

Published : Sep 18, 2020, 4:36 PM IST

కరోనా కారణంగా మూసేసిన ఉత్తరాఖండ్​ పిథోరాగఢ్​లోని అంతర్జాతీయ వంతెనను అధికారులు పది నిమిషాల పాటు తెరిచారు. నేపాల్-భారత్​ను కలిపే ఈ వంతెనను ఓ నేపాలీ బాలిక అభ్యర్థన మేరకు గురువారం ఉదయం 10.30 గంటలకు తెరిచినట్లు అధికారులు వెల్లడించారు. భారత్​లో బీకామ్ పరీక్షలు రాసేందుకు నేపాల్ బాలిక వచ్చినట్లు తెలిపారు. దర్ఛులా జిల్లా సబ్​ కలెక్టర్​, నేపాల్ అధికారులతో మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

ఉత్తరాఖండ్​ హల్ద్వానీలోని ఓ ప్రభుత్వ కళాశాలలో యువతి చదువుకుంటోందని వెల్లడించారు సశస్త్ర సీమా బల్(ఎస్​ఎస్​బీ) ఇన్స్​పెక్టర్ కశ్మీరా సింగ్. పది నిమిషాల పాటు ఈ వంతెనను తెరవగా.. భారత్​ నుంచి 36 మంది నేపాల్​కు వెళ్లారని.. 34 మంది నేపాల్ నుంచి భారత్​కు వచ్చినట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details